రాళ్ల సందులో ఇరుక్కున్న తల.. పక్కనే భయంకరమైన విష సర్పం.. 8 గంటలు నరకం చూసిన బాలుడు!
- తేనె కోసం వెళ్లి బండరాళ్ల మధ్య ఇరుక్కుపోయిన బాలుడు
- 8 గంటల పాటు పక్కనే విష సర్పంతో నరకయాతన
- ఒడిశాలోని నాయగఢ్ జిల్లాలో జరిగిన షాకింగ్ ఘటన
- బాలుడిని సురక్షితంగా కాపాడిన పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది
తేనె కోసం వెళ్లిన ఓ బాలుడికి భయంకరమైన అనుభవం ఎదురైంది. దాదాపు 8 గంటల పాటు బండరాళ్ల మధ్య తల ఇరుక్కుపోయి నరకయాతన అనుభవించాడు. అత్యంత భయానకమైన విషయం ఏమిటంటే, అతను ఇరుక్కున్న చోటే ఓ పెద్ద విష సర్పం కూడా ఉంది. ఒడిశాలో ఈ ఘటన జరిగింది.
వివరాల్లోకి వెళితే.. నాయగఢ్ జిల్లా కనిపాడ అటవీ ప్రాంతంలో శిబా ప్రధాన్ అనే బాలుడు బుధవారం తన మేనమామతో కలిసి తేనె సేకరణకు వెళ్లాడు. అక్కడ రాళ్ల మధ్య సందులో తేనెపట్టు కనిపించడంతో దాన్ని తీసుకునేందుకు తల దూర్చాడు. లోపల ఉన్న తేనెపట్టును అందుకునే ప్రయత్నంలో అతని తల బయటకు రాలేక రాళ్ల మధ్య ఇరుక్కుపోయింది.
మేనమామ ఎంత ప్రయత్నించినా బాలుడిని బయటకు తీయలేకపోయాడు. దీంతో వెంటనే గ్రామస్థులకు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. వారి ప్రయత్నాలు కూడా విఫలం కావడంతో చివరికి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఒడగావ్, నాయగఢ్ నుంచి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది రెండు బృందాలుగా ఘటనా స్థలానికి చేరుకున్నారు.
అయితే, బాలుడు ఇరుక్కున్న సందులో పెద్ద విష సర్పం ఉండటంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడిందని ఓ అధికారి తెలిపారు. సిబ్బంది చాలా జాగ్రత్తగా, దాదాపు 8 గంటల పాటు శ్రమించి ఎట్టకేలకు బాలుడిని సురక్షితంగా బయటకు తీశారు. బాలుడికి ఎలాంటి పెద్ద గాయాలు కాలేదని, అతడిని సురక్షితంగా కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు అధికారులు తెలిపారు. బాలుడు క్షేమంగా బయటపడటంతో అతని కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.